FBI: ట్రంప్ విషయాలను బైడెన్‌కు లీక్ చేస్తున్న ఇరాన్
FBI: అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ సంచలన ఆరోపణలు చేసింది. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ కుట్రకు పాల్పడుతోందట. ఇందుకోసం ఇరాన్‌కు చెందిన హ్యాకర్ల చేత రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన రహస్యాలను.. ప్రస్తు అధ్యక్షుడు జో బైడెన్ మద్దతుగారులకు లీక్ చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పొగొట్టే విధంగా ఇరాన్ చర్యలు ఉన్నాయని ఎఫ్‌బీఐ మండిపడింది. ఈ ఏడాది జూన్ నుంచి అమెరికన్ మీడియా సంస్థల నుంచి కాన్ఫిడెన్షియల్ డేటాను హ్యాక్ చేసి జో బైడెన్ సపోర్టర్ల చేతిలో పెడుతున్నారట.
అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో బైడెన్ నుంచి కానీ ఆయన కేబినెట్ సభ్యుల నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. మరోపక్క తమపై తప్పుడు ఆరోపణలకు పాల్పడితే సహించేది లేదని ఇరాన్ మండిపడుతోంది. ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఇరాన్‌కు చుక్కలే. దాంతో ఆయన్ను ఓడించి డెమోక్రాటిక్ అభ్యర్ధి అయిన కమలా హ్యారిస్‌ను గెలిపిస్తే తమ దేశానికి అన్ని విధాలా మంచిది అన్న ఆలోచనతో ఇరాన్ ఈ కుట్రకు పాల్పడిందని ఎఫ్‌బీఐ అంటోంది.