Balineni: రాజీనామా చేసేసారు
Balineni: మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రాజీనామా చేసేసారు. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విధానాలు నచ్చకే రాజీనామా అంటూ రాజీనామా లేఖాస్త్రం సంధించారు. బాలినేని రాజీనామా చేస్తాను అని పార్టీ కార్యకర్తలతో చెప్పినప్పుడు ఆయనకు నచ్చజెప్పి పార్టీలోనే ఉండేలా ఒప్పించాలని విడదల రజనీని మధ్యవర్తిత్వం చేయాలని జగన్ పంపారు. అది బాలినేని అవమానంగా ఫీలయ్యారు. స్వయంగా జగనే పిలిచి మాట్లాడి ఉంటే బహుశా తన నిర్ణయం మారేదేమో. తనకంటే వయసు అనుభవంలో చిన్నదైన రజనీని పంపడం బాలినేనికి నచ్చలేదు. దాంతో పార్టీకి రాజీనామా చేసేసారు. ఇక ఆయన తెలుగు దేశంలోకి వెళ్తారా లేక జనసేన, భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.