Balka Suman: నాగార్జున 400 కోట్లు ఇవ్వ‌లేదు.. రేవంత్‌కి మండింది

balka suman says nagarjuna did not pay revanth reddy

Balka Suman: ఇటీవ‌ల హైడ్రా సంస్థ అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ను కూల‌గొట్టేసిన అంశం తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఆ క‌న్వెన్ష‌న్‌ను తమ్మిడికుంట చెరువును ఆక్ర‌మించి నిర్మిచారని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆరోపిస్తూ కూల్చివేత‌కు ఆదేశాలు జారీ చేసారు. దాంతో ఈ విష‌యాన్ని తాను కోర్టులో తేల్చుకుంటాన‌ని నాగ్ అన్నారు. అయితే హైడ్రా ఎన్ క‌న్వెన్ష‌న్‌ను కూల్చేయ‌డానికి కార‌ణం తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అడిగిన డ‌బ్బు నాగార్జున ఇవ్వ‌క‌పోవ‌డ‌మే అని భార‌త రాష్ట్ర స‌మితి నేత బాల్క సుమ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. రేవంత్ రెడ్డి రూ.400 కోట్లు అడిగాడ‌ని… అది ఇచ్చేందుకు నాగార్జున ఒప్పుకోక‌పోవ‌డంతో ఎన్ క‌న్వెన్ష‌న్‌ని కూల్చేసార‌ని ఆయ‌న అన్నారు.

“” రేవంత్ రెడ్డి ఎన్ క‌న్వెన్ష‌న్‌ను కూల్చేసారు. ఎందుకు కూల్చేసారు అని అడ‌గ్గా.. అది త‌మ్మిడికుంట చెరువును ఆక్ర‌మించి నిర్మించార‌ని.. బ‌ఫ‌ర్ జోన్ కిందికి వ‌స్తుంద‌ని చెరువుల‌ను కాపాడే సిపాయి (రేవంత్) అంటున్నాడు. అదే కార‌ణం అనుకుందాం. మ‌రి హిమాయ‌త్ సాగ‌ర్ చెరువులోనే ఆనంద క‌న్వెన్ష‌న్ అనే నిర్మాణం ఉంది. దానిని ఎందుకు కూల‌గొట్ట‌లేదు. ఎన్ క‌న్వెన్ష‌న్ చెరువు ప‌క్క‌న ఉంది. కానీ ఆనంద క‌న్వెన్ష‌న్ హిమాయ‌త్ సాగ‌ర్ చెరువులోనే క‌ట్టేసారు. దానిని కూల‌గొట్ట‌కుండా ఉండ‌టానికి కార‌ణం ఏంటంటే.. నాగార్జున‌ను రేవంత్ రూ.400 కోట్లు డిమాండ్ చేసారు. అది ఆయ‌న ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ క‌న్వెన్ష‌న్‌ను కూల‌గొట్టారు. ఆనంద క‌న్వెన్ష‌న్ ఓన‌ర్లను బెదిరించి డ‌బ్బులు అడిగితే వారు ముడుపులు స‌మ‌ర్పించుకున్నారు కాబ‌ట్టి దానిని వ‌దిలేసారు “” అని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు.