భార‌త్‌లో మ‌కాం వేసిన బంగ్లాదేశీయులు.. వారిలో బంగ్లా ఉగ్ర‌వాదులు

50000 bangladesh people in india

India: బంగ్లాదేశ్‌లో రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డిన నేప‌థ్యంలో మెల్లిగా బంగ్లా వాసులు భార‌త్‌లో తిష్ట వేసారు. ఇప్ప‌టికే బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా నెల రోజుల నుంచి ఢిల్లీలో త‌ల‌దాచుకుని ఉంది. యూకే నుంచి అనుమ‌తి రాగానే జంప్ అయిపోవాల‌ని చూస్తోంది. ఈ నేప‌థ్యంలో బంగ్లాలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌ను త‌ట్టుకోలేక అక్క‌డి నుంచి భార‌త్‌కు అక్ర‌మంగా వ‌ల‌స వ‌చ్చిన వారు చాలా మందే ఉన్నార‌ట‌. కేవ‌లం ఆగ‌స్ట్ నెల‌లో ఏకంగా 50 వేల మంది బంగ్లా వాసులు భార‌త్‌లోకి ప్ర‌వేశించారు. ఈ విష‌యాన్ని బంగ్లాకు చెందిన హిందూ యాక్టివిస్ట్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. భార‌త్‌కు వ‌ల‌స వ‌చ్చిన వారిలో హిందువులు, అవామీ లీగ్ స‌భ్యులతో పాటు అన్సారుల్లా బంగ్లా అనే ఉగ్ర‌వాద సంస్థ స‌భ్యులు కూడా ఉన్నార‌ని తెలిపాడు.

దీనిని బ‌ట్టి చూస్తేనే ఇండియా బంగ్లా స‌రిహ‌ద్దు ఏ రేంజ్‌లో ప‌నిచేస్తున్నాయో అర్థ‌మ‌వుతోంది అని సెటైర్ వేసాడు. బంగ్లాకు చెందిన రాజ‌కీయ నేత బ‌హౌద్దిన్ బాహ‌ర్ అనే వ్య‌క్తి కూడా ఇండియాలోనే త‌ల‌దాచుకున్నాడ‌ని.. అత‌ను బంగ్లాలో ఉన్న‌ప్పుడు హిందూ పండ‌గ‌ల గురించి తప్పుడు వ్యాఖ్య‌లు చేసి మ‌ళ్లీ ఇప్పుడు సిగ్గు లేకుండా ఇండియాలో త‌ల‌దాచుకోవ‌డం హాస్యాస్ప‌దం అని తెలిపాడు. జ‌మాత్ ఏ ఇస్లామీ, అన్సారుల్లా బంగ్లా వంటి ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు చెందిన స‌భ్యులు గువ‌హాటి, క‌ల‌క‌త్తా, మేఘాల‌యా వంటి ప్ర‌దేశాల్లో దాక్కుని ఉన్నార‌ని వెల్ల‌డించాడు. ఒక‌వేళ భార‌త స‌రిహ‌ద్దులో ఎలాంటి చెకింగ్‌లు, భ‌ద్ర‌తా ఏర్పాట్లు లేక‌పోతే పెద్ద ప్ర‌మాద‌మే పొంచి ఉండే అవ‌కాశం లేక‌పోలేద‌ని హెచ్చ‌రిస్తున్నాడు.