Shreyas Iyer: అయ్యర్‌కి BCCI షాక్
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ టైం బాలేదు. ప్రస్తుతం అతను ఫాంలో లేడు. దాంతో బంగ్లాదేశ్ సిరీస్‌లో చోటు కల్పించకూడదని BCCI నిర్ణయించింది. ఇది అయ్యర్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. దులీప్ ట్రోఫీలో 4 ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులు మాత్రమే తీసాడు. ఇలాంటి పెర్ఫామెన్స్‌తో ముందు ముందు లాంగ్ ఫార్మాట్స్‌లో ఆడతాడో లేదో అనే సందేహం BCCI వ్యక్తం చేస్తోంది. యువ ఆటగాళ్లైన ధృవ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్‌లు దూసుకెళ్తున్నారు. వీరు ముగ్గురూ అయ్యర్ కంటే బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. మళ్లీ ఫాంలోకి రావాలంటే అయ్యర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అని బీసీసీఐ వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే ఇరానీ కప్‌లో అయ్యర్ ఆడబోతున్నాడు. రంజి ట్రోఫీ, ఇరానీ కప్‌లో తన సత్తాను చాటుకుంటే అప్పుడు టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కించుకునే అవకాశం కొంతైనా ఉంది.