Russia: ఆఫీసుల్లో కూడా సెక్స్ చేయండి.. ప్లీజ్

Russia: ర‌ష్యాలో సంతానోత్ప‌త్తి రేటు దారుణంగా ప‌డిపోయింది. ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఇక ర‌ష్యాలో రాబోయే జ‌న‌రేష‌న్ అనేది ఉండ‌దు అని అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చేసిన ఓ ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. సంతానోత్ప‌త్తి పెంచేందుకు ఉద్యోగులు ఆఫీసులో ఏమాత్రం ఖాళీ దొరికినా సెక్స్‌లో పాల్గొనాల‌ని అప్పుడే ఈ కొర‌త‌ను నియంత్రించ‌వ‌చ్చ‌ని అన్నారు. ఆఫీసుల్లో ప‌నిచేసేవారు కాఫీ బ్రేక్, లంచ్ బ్రేక్ వంటి స‌మ‌యాల్లో సెక్స్ చేస్తుండాల‌ని సూచించారు.

ప్ర‌స్తుతానికి ర‌ష్యాలో సంతానోత్ప‌త్తి రేటు 1.5గా ఉంది. అంటే ఒక‌రిని కూడా క‌నేందుకు సిద్ధంగా లేరు. గ‌త జ‌న‌రేష‌న్స్‌తో పోలిస్తే కనీసం ఒక జంట‌కు ముగ్గురు పిల్ల‌లు ఉండేవారు. ర‌ష్యాలో ప‌నివేళ‌లు ఎక్కువ‌గా ఉన్నందుకే పిల్ల‌ల్ని క‌న‌లేక‌పోతున్నార‌ని ర‌ష్యా ఆరోగ్య శాఖ మంత్రి యెవ్జెనీ తెలిపారు. కాబ‌ట్టి రోజుకు 12 నుంచి 14 గంట‌ల పాటు ఆఫీసుల్లో పని చేసేవారు మ‌ధ్య‌లో దొరికే ఖాళీ స‌మ‌యాల్లో శృంగారంలో పాల్గొంటూ ఉండాల‌ని అప్పుడే ర‌ష్యాలో ముందు ముందు జ‌నాభా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.

1999 నుంచి చూసుకుంటే ఈ ఏడాది జూన్‌లో మ‌రీ త‌క్కువ శాతంలో శిశువులు జ‌న్మించారు. మొన్న జూన్‌లో ర‌ష్యా మొత్తంలో కేవ‌లం ల‌క్ష మందే జ‌న్మించారు. 2023తో పోలిస్తే 2024లో 16000 జ‌న‌నాలు త‌గ్గిపోయాయి. పైగా ఈ ఏడాదిలో 49 వేల మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీనికి ఉక్రెయిన్‌పై ర‌ష్యా.. ర‌ష్యాపై ఉక్రెయిన్ చేసుకుంటున్న యుద్ధ‌మే ప్ర‌ధాన కార‌ణం. అంతేకాదు.. ర‌ష్యాకు చెందిన ఆడ‌వాళ్లు 19 ఏళ్లకే పిల్ల‌ల్ని క‌న‌డం మొద‌లుపెట్టాల‌ని అంటున్నారు. మ‌రో విష‌యం ఏంటంటే.. చెల్యాబిన్‌స్క్ అనే ప్రాంతంలో 24 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సున్న ఆడ‌పిల్ల‌లు మొద‌టి బిడ్డ‌ను కంటే రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.