Jhansi: ఇది చిన్న కేసు కాదు.. లోపల చాలా విషయాలున్నాయ్
Jhansi: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచార కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రముఖ యాంకర్, నటి ఝాన్సి స్పందించారు. ఇది చిన్న విషయం కాదని అన్నారు. చాలా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే లైంగిక వేధింపులు మొదలయ్యాయని సంచలన ఆరోపణలు చేసారు. కేవలం సెక్సువల్ హెరాస్‌మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఒక్కటే కాదని…. అంతకు మించిన విషయాలు ఈ కేసులో లీగల్‌గా ముడిపడి ఉన్నాయి అన్నీ బయటికి రావాలని వెల్లడించారు.