“నాకు పూర్ణతో లవ్ ఎఫైర్ ఉంది”
Hyderabad: దర్శకుడు రవిబాబు(ravibabu) షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. హీరోయిన్ పూర్ణ(poorna)తో తనకు లవ్ ఎఫైర్ ఉందని చెప్పి రచ్చకెక్కారు. రవిబాబు(ravibabu) దర్శకత్వంలో వచ్చిన అసలు(asalu) సినిమా ఇటీవల రిలీజ్ అయింది. ఇందులో పూర్ణ కీ రోల్‌లో నటించారు. రవిబాబు, పూర్ణ కాంబినేషన్‌లో అవును1, అవును 2 సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అసలు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రవిబాబు మాట్లాడుతూ.. తనకు పూర్ణతో లవ్ ఎఫైర్ ఉందని, అయితే అందరూ అనుకునే ఆ ఎఫైర్ కాదని తెలిపారు. సినిమాలో ఒక రోల్ ఇస్తే 100% న్యాయం చేసే నటుల పట్ల దర్శకులకు ఒక రకమైన ప్రేమ ఉంటుందని, పూర్ణపై తనకు ఉన్న ప్రేమ అలాంటిదేనని వివరణ ఇచ్చారు. పూర్ణ ఆ విషయంలో 200% ఇస్తుందని, అనుకున్నదానికంటే ఎక్కువ అవుట్‌పుట్ ఇచ్చే హీరోయిన్ పూర్ణ అయిన తెలిపారు. అల్లరి నరేష్‌తో తీసిన లడ్డుబాబు సినిమాలోనూ పూర్ణ నటించారు. ఈ సినిమాకు కూడా రవిబాబే దర్శకుడు. ఏదేమైనా పెళ్లై ఓ బిడ్డకు తల్లైన పూర్ణ గురించి మీడియా ముందు అలా లవ్ ఎఫైర్ ఉందని చెప్పడం సబబు కాదని పలువురు రవిబాబుకు క్లాస్ పీకుతున్నారు.