Microsoft Satya Nadella: 85 శాతం ఉద్యోగులు స‌రిగ్గా ప‌నిచేయ‌డంలేదు

Microsoft Satya Nadella: తమ కంపెనీలో ప‌నిచేస్తున్న‌వారిలో 85 శాతం మంది స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేద‌ని మేనేజ‌ర్ల నుంచి త‌న‌కు ఫిర్యాదు అందిన‌ట్లు తెలిపారు మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్య నాదెళ్ల‌. కంపెనీలో ఉత్పాద‌క‌త ఎలా ఉందో తెలుసుకునేందుకు ఉద్యోగుల నుంచి మేనేజ‌ర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు నాదెళ్ల‌. ఆ ఫీడ్‌బ్యాక్‌లో తెలిసింది ఏంటంటే.. 85 శాతం మంది ఉద్యోగులు స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేద‌ని మేనేజ‌ర్లు అన్నార‌ట‌. మ‌రోప‌క్క 85 శాతం మంది ఉద్యోగులు ఓవ‌ర్ వ‌ర్క్ చేస్తూ అనారోగ్యానికి గుర‌వుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఏ కంపెనీలో అయినా ఇలాంటి స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు అస‌లైన డేటాపై దృష్టి పెడితే ఎవ‌రు ఎంత ప‌నిచేస్తున్నారో తెలిసిపోతుంద‌ని నాదెళ్ల స‌ల‌హా ఇస్తున్నారు. కోవిడ్ త‌ర్వాత వ‌ర్క్ ఫ్రం హోం అవ‌కాశాలు పెరిగిపోయాయ‌ని.. దాంతో ఎవ‌రు ఎంత మోతాదులో ప‌నిచేస్తూ ప్రొడ‌క్టివిటీగా ఉంటున్నారో తెలుసుకోలేక‌పోతున్నామ‌ని అన్నారు. ఇలాంట‌ప్పుడే లీడ‌ర్లు క్లియ‌ర్ గోల్స్ పెట్టుకుని ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్యోగుల‌ను ప‌ర్య‌వేక్షిస్తుండాల‌ని అన్నారు.