ఉక్కు పరిశ్రమపై భగ్గుమంటున్న ఏపీ, తెలంగాణ నేతలు

vijayawada: ఏపీ(ap)లో చాలా రోజుల తర్వాత విశాఖ ఉక్కు(vizag steel plant) అంశం తెరపైకి వచ్చింది. గత నెల 27న స్టీల్‌ప్లాంట్‌లో బిడ్‌(bid) వేసేందుకు విశాఖ ఉక్కు సంస్థ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌(cm kcr) ఆసక్తి చూపారు. కొనుగోలు విషయమై సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని ముగ్గురు సింగరేణి డైరెక్టర్లను సైతం ఇటీవల ఏపీకి పంపారు. ఈ విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం(ycp) సైలెంట్‌గా ఉంది. అయితే ఈక్రమంలో నిన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్(minister fuggon singh)విశాఖపట్నం(vishakapatanam) వచ్చారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(steel plant privatization) అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతకంటే ముందు ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని వెల్లడించారు. దీనిపై స్పందించిన తెలంగాణ మంత్రులు హరీష్‌రావు(harish rao), కేటీఆర్‌(ktr), .. ‘‘కేసీఆర్ దెబ్బకే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గింది” అని అన్నారు. ఇది కేసీఆర్, బీఆర్ఎస్, ఏపీ ప్రజలు, అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుల విజయమని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకున్నా బీఆర్ఎస్ పోరాటం చేసిందని చెప్పారు.

తాజాగా తెలంగాణ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది అనే మాట వాస్తవమైతే.. సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై ఎందుకు దిగిరాలేదంటూ మాజీ మంత్రి పేర్ని నాని(perni nani) ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ(botsa sathyanarayana) మాట్లాడుతూ.. హరీష్‌రావు బాధ్యతగా మాట్లాడాలి అని సూచించారు. ఇక దీనిపై జనసేన పార్టీ(janasena party) పవన్‌కల్యాణ్‌(pavankalyan) స్పందించారు. గతంలో అమిత్‌షా(Amit sha)ను కలిసినప్పుడు విశాఖ ఉక్కు భావోద్వేగాలతో ముడిపడి ఉందని. తమ పార్టీ ముందునుంచే ప్రైవేటీకరణ వద్దని చెబుతోందని పేర్కొన్నారు.