SS Thaman: అనుష్క ప్ర‌తి సంవ‌త్స‌రం ఐఫోన్ ఇస్తుంది

SS Thaman: అనుష్క శెట్టి ప్ర‌తి సంవ‌త్స‌రం త‌న‌కు ఐఫోన్ బ‌హుమ‌తిగా ఇస్తుంద‌ని తెలిపారు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్. అనుష్క న‌టించ‌ని భాగ‌మ‌తి సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ అవుతున్న స‌మ‌యంలో ఈ సినిమా హిట్ అయితే ప్ర‌తి సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్‌లో లాంచ్ అయ్యే యాపిల్ ఫోన్ గిఫ్ట్‌గా ఇస్తాన‌ని మాటిచ్చార‌ట‌. ఆ సినిమా రిలీజ్ అవ్వ‌డం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ‌డంతో అనుష్క ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ వ‌స్తున్నారు. మ‌రి ఈ నెల‌లో రిలీజ్ అయిన కొత్త యాపిల్ ఫోన్ త‌మ‌న్ అందుకున్నారో లేదో..!