Padi Kaushik Reddy: ఆ పదవి కోసం రేవంత్ నా కాళ్లు పట్టుకున్నాడు
Padi Kaushik Reddy: గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) తన కాళ్లు పట్టుకున్నాడని సంచలన ఆరోపణలు చేసారు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గతంలో తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఓసారి రేవంత్ తన ఇంటికి వచ్చాడని.. TPCC ఛైర్మన్ పదవి తనకు ఇవ్వాలంటూ తన కాళ్లపై పడి వేడుకున్నాడని అన్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి మర్చిపోయి ఉండచ్చు కానీ తనకు అన్నీ గుర్తున్నాయని అన్నారు.