గచ్చిబౌలిలో దారుణం.. హోటల్లో విద్యార్థిని ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో దారుణం చోటుచేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. జడ్చర్లకు చెందిన శృతి అనే ఓ యువతి (23) హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం రేప్ చేసి చంపేసినట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గదిలో రక్తపు మరకలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో శృతి యశోద హాస్పిటల్లో నర్సుగా పనిచేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.