Govinda: మంత్రి కూతురు నా కోసం ఇంట్లో పనిమనిషిలా చేరింది
Govinda: గోవింద.. బాలీవుడ్లో అయితే పరిచయం అవసరం లేని పేరు. సల్మాన్, షారుక్ ఖాన్లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ గోవిందకు ఉంది. కానీ ఆయన వారిలా అగ్రస్థానంలో నిలవలేకపోయారు. అయితే.. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి గోవింద వెల్లడించిన ఓ ఘటన షాక్కు గురి చేసింది. తనకు పెళ్లైన కొత్తలో ఓ అమ్మాయి ఇంట్లో ఏదన్నా పని ఉంటే చెప్పండి. డబ్బు అవసరం ఉంది అని వచ్చిందట. ఆ అమ్మాయిని చూస్తే పని మనిషిలా లేదు. పైగా పెద్దింటి అమ్మాయిలా ఉంది. పోనీలే అని పనిలో పెట్టుకుని ఇంటి బయట ఉన్న రూంలో ఉండేందుకు అనుమతిచ్చారు.
ఆ అమ్మాయి ఇంట్లో పన్లు సరిగ్గా చేసేది కాదు. అసలు చేయడం కూడా రాదు. పైగా షూటింగ్ ముగించుకుని గోవింద ఇంటికి వచ్చే సమయానికి రాత్రిళ్లు నిద్రపోకుండా హాల్లో ఎదురుచూస్తుండేదట. గోవింద భార్య సునిత అది గమనించి ఓసారి కోప్పడిందట. దాంతో ఆ అమ్మాయి తాను పనిమషినిని కానని.. తన తండ్రి మంత్రి అని చెప్పింది. అది విని వారు షాకయ్యారు. తాను గోవిందకు వీరాభిమానినని.. అతని కోసమే ఇంట్లో నుంచి పారిపోయి ఇలా పనిమనిషిలా నటిస్తున్నానని చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ అమ్మాయి తండ్రి ఏకంగా నాలుగు కార్లలో వచ్చి తీసుకెళ్లాడట. గోవిందకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది అని తన భార్య సునీత చెప్తూ తెగ మురిసిపోయింది.