Harish Salve: ఫోగాట్ కేసును లైట్ తీసుకుంది.. సాల్వే సంచ‌ల‌నం

Harish Salve sensational comments on vinesh phogat

Harish Salve: పారిస్ ఒలింపిక్స్‌లో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వం గురించి ఇటీవ‌ల భార‌త రెజ్ల‌ర్ వినేష్ ఫోగాట్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లో లాయ‌ర్లు త‌న కోసం స‌రిగ్గా పోరాడ‌లేద‌ని.. ఇండియ‌న్ ఒలింపిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు పిటి ఉష కేవ‌లం త‌న‌తో ఓ ఫోటో తీసుకుని అక్క‌డి నుంచి వెళ్లిపోయిందని షాకింగ్ కామెంట్స్ చేసారు.

వినేష్ ఫోగాట్ వ్య‌క్తిగ‌త లాయ‌ర్ల‌తో పాటు ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ త‌ర‌ఫున ప్ర‌ముఖ న్యాయ‌వాది హ‌రీష్ సాల్వేను నియ‌మించారు. అయితే తాను కేసు కోసం పోరాడేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటే వినేష్ త‌ర‌ఫు లాయ‌ర్లు మాత్రం సీరియ‌స్‌గా తీసుకోలేద‌ని.. ఏ విష‌యం కూడా త‌న‌తో చ‌ర్చించ‌లేద‌ని హ‌రీష్ సాల్వే అన్నారు.

ఈ కేసును వాదించిన‌ప్ప‌టికీ CAS వినేష్‌కు వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చింది. జాయింట్ వెండి ప‌త‌కం ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఆ త‌ర్వాత సాల్వే వినేష్‌ను సంప్ర‌దించి.. స్విస్ కోర్టులో పిటిష‌న్ వేద్దామ‌ని.. అక్క‌డ కచ్చితంగా న్యాయం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పినా వినేష్ మాత్రం అవ‌స‌రం లేదు అని ప్ర‌య‌త్నించ‌కుండా వెళ్లిపోయింద‌ని ఆయ‌న మ‌రో షాకింగ్ అంశాన్ని బ‌య‌ట‌పెట్టారు. త‌ను సాయం చేస్తాన‌న్నా వినేష్ వ‌ద్ద‌ని వెళ్లిపోయి ఇప్పుడు ప్ర‌భుత్వంపై త‌మ లాంటి లాయ‌ర్ల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌బ‌బు కాద‌ని సాల్వే అన్నారు. దీనిని బ‌ట్టి చూస్తే వినేష్ రెజ్లింగ్ వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌న్న ఉద్దేశంతోనే చివ‌రి వ‌ర‌కు త‌న మెడ‌ల్ కోసం ప్ర‌య‌త్నించ‌కుండా ఉండిపోయార‌ని తెలుస్తోంది.