Samantha: మాటలు రావట్లేదు.. థాంక్యూ మై హీరో!

Hyderabad: టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ సమంత(Samantha) నటించిన శాకుంతలం(Shaakunthalam) రేపు(ఏప్రిల్ 14) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. గుణశేఖర్(Guna Shekar)​ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా గడిపిన సమంత(Samantha) కాస్త అస్వస్థతకు గురయ్యారు. కాగా, సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రౌడీ హీరో విజయ్(Vijay Deverakonda)​ దేవరకొండ సోషల్​ మీడియా ద్వారా సామ్​కు ఎమోషనల్​గా లేఖ రాశారు. ‘ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతే అవసరం. థాంక్యూ మై హీరో’​  అంటూ విజయ్​కి బదులిచ్చింది సామ్​.

ఇక రేపు సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఓ ఎమోషనల్​ లేఖ రాశారు విజయ్​. ‘గత ఏడాది కాలంగా నువ్వు ఓ యోధురాలిగా పోరాడుతున్నావు. ఆరోగ్యం బాలేకపోయినా ప్రేక్షకులను అలరించేందుకు కష్టపడుతున్నావు. నువ్వు ఎప్పుడూ ఉత్సాహంగా, అందరితో ప్రేమగా ఉంటావు. ఎంచుకునే సినిమాలపైనే కెరీర్​ ఆధారపడి ఉంటుందని భావిస్తావు. శాకుంతలం చిత్రానికి నా శుభాకాంక్షలు. నీ సంకల్పంతోపాటు లక్షలాది అభిమానుల ప్రేమ నిన్ను కాపాడుతుంది’ అంటూ రాసుకొచ్చారు విజయ్​. సామ్​ కూడా విజయ్​కి ఎమోషనల్​గా రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్​ నెట్టింట వైరల్​గా మారింది.

విజయ్​, సమంత జంటగా మహానటి(Mahanati) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి(Kushi) సినిమాలో నటిస్తున్నారు. కాగా, వీరిద్దరూ మంచి స్నేహితులు. చాలాసార్లు విజయ్​, సామ్​ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు.