karnataka elections: బుజ్జగిస్తా రండి – యడ్యూరప్ప
Bengaluru: కర్నాటక ఎన్నికలు(karnataka elections) ఈసారి రసవత్తరంగా మారనున్నాయి. సర్వేలు కూడా ముందు నుంచే కాంగ్రెస్ పార్టీకి ఈ సారి కొంత ఎడ్జ్ ఉండే చాన్స్ ఉందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను బీజేపీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. కర్నాటక అగ్రనాయకులను ఢిల్లీకి పిలిపించుకుని ప్రధాని మోదీ(pm modi), హోంమంత్రి అమిత్షా(amit sha), బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా(jp nadda) ఆధ్వర్యంలో వరుస భేటీల అనంతరం రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ముందునుంచే అనుకుంటున్నట్లే దాదాపు 40 శాతం మంది వరకు కొత్త వారికి సీట్లను కేటాయించారు. దీంతో బీజేపీలో అసమ్మతి స్వరాలు ఎగసిపడ్డాయి. అభ్యర్థుల ఎంపికలో అత్యంత ప్రభావితంగా పనిచేసిన నాయకుడు మాజీ సీఎం యడుయూరప్ప(bs yediyurappa). ఈ సారి ఆయన ఎన్నికల్లో పాల్గొనకుండా.. తన కుమారుడు విజయేంద్రకు టిక్కెట్టు ఇప్పించారు. అంతేకాకుండా అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రుల కొడుకులకు సైతం ఈ సారి టిక్కెట్లు కేటాయించారు. అయితే జేపీ నడ్డాతో యడుయురప్పా మరోసారి సమావేశమై పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకుంటానని భరోసా కల్పించినట్లు సమాచారం. దాదాపు 60 మంది కొత్తవారికి సీట్లు కేటాయించడం.. అవినీతి ఆరోపణలు, ఇతరత్రా కారణాలతో సీనియర్లను పక్కన పెట్టడంతో ఇప్పుడు బీజేపీలో ఎమ్మెల్యేలు, కీలకనేతలు రాజీనామాల బాటపట్టారు.
సీటు దక్కని నాయకుల్లో అసంతృప్తిని తగ్గించేందుకు బీజేపీ సీనియర్ నాయకులు యడియూరప్పను ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది. అసమ్మతి నేతల(bjp rebels)తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే బాధ్యతను ఆయన భుజానవేసింది. ఈ విషయంపై జేపీ నడ్డా…. యడియూరప్పతో ఫోన్లో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్లు దక్కని నాయకులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించి… వారికి నచ్చజెప్పాలని.. నడ్డా కోరినట్లు తెలుస్తోంది. ఇక అసమ్మతి నాయకులకు యడియూరప్పకు మంచి సత్సంబంధాలున్నాయి. దీంతో ఆయన శక్తిమేరకు నాయకులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.