Hamza Bin Laden: బతికే ఉన్న బిన్ లాడెన్ కొడుకు.. ఆ దేశాలపై దాడికి ప్లానింగ్
Hamza Bin Laden: కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ ఇంకా బతికే ఉన్నాడట. అంతేకాదు.. పశ్చిమ దేశాలపై దాడులకు పాల్పడేందుకు ప్లానింగ్ కూడా చేసుకుంటున్నట్లు ఇంటెలిజన్స్ వర్గాలు వెల్లడించారు. 2019లోనే హమ్జా చనిపోయాడని అంతా అనుకున్నారు. కానీ అతను బతికే ఉన్నాడని అల్ ఖైదాను అతనే దగ్గరుండి నడిపిస్తున్నాడని సమాచారం. తాలిబన్ల మద్దతుతో అల్ ఖైదా పశ్చిమ దేశాలపై దాడులకు పాల్పడేందుకు హమ్జా పెద్ద ప్లాన్‌లో ఉన్నాడు. అల్ ఖైదాకు మద్దతు తెలుపుతున్న తాలిబన్లే హమ్జాను అతని కుటుంబీకులను రక్షిస్తున్నారు. భవిష్యత్తులో 9/11 వంటి దాడులకు పాల్పడబోతున్నారు. ఇందుకోసం దాదాపు 21 ఉగ్రవాద గ్రూప్స్ కలిసి అఫ్ఘానిస్థాన్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు ఇంటెల్ వర్గాలు చెప్తున్నాయి. హజ్జా నుంచి 2018లో ఓ పబ్లిక్ స్టేట్మెంట్ వచ్చింది. సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని కూలగొట్టే పనిలో ఉన్నట్లు ఆ స్టేట్మెంట్ ద్వారా హెచ్చరికలు పంపాడు.