Virat Kohli: 147 ఏళ్ల రికార్డుకు ఇంకొద్ది దూరంలో
Virat Kohli: T20 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన విరాట్ కోహ్లీ సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న బంగ్లాదేశ్ సిరీస్‌లో ఆడనున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీనే హైలైట్. ఇప్పటివరకు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 80 సెంచరీలు బాదాడు. మరోపక్క మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ 100 సెంచరీలు చేసారు. దాంతో కోహ్లీని సచిన్‌తో పోలుస్తుంటారు. ఇప్పుడు సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి 147 ఏళ్ల చరిత్రను తిరగరాయడానికి కోహ్లీ అతికొద్ది దూరంలోనే ఉన్నాడు. ఇప్పటివరకు కోహ్లీ ఖాతాలో 27000 అంతర్జాతీయ పరుగులు ఉండాలంటే మరో 58 పరుగులు అవసరం. ఈ బంగ్లాదేశ్ సిరీస్‌లో ఆ పరుగులు కాస్తా తీసాడంటే 147 ఏళ్ల చరిత్రను తిరగరాసిన వాడు అవుతాడు.
27000 అంతర్జాతీయ పరుగులు తీసేందుకు సచిన్‌కు 623 ఇన్నింగ్స్ పట్టింది. కానీ కోహ్లీకి 600 ఇన్నింగ్స్ చాలు. ఇప్పటివరకు భారత్ నుంచి సచిన్ తెందుల్కర్, ఆస్ట్రేలియా నుంచి రికీ పాంటింగ్, శ్రీలంక నుంచి కుమార సంగక్కరలకే ఈ 27000 అంతర్జాతీయ పరుగులు సాధ్యమైంది.