Vijayalakshmi: ద‌ర్శ‌న్ జైల్లో.. భార్య పార్టీలో

Vijayalakshmi darshan partying pictures goes viral

Vijayalakshmi: ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ తూగుదీప రేణుకా స్వామి అనే అభిమాని హ‌త్య కేసులో బ‌ళ్లారి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఓ ప‌క్క ద‌ర్శ‌న్ జైల్లో ఉంటే.. ఆయ‌న భార్య విజ‌య‌ల‌క్ష్మి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు బ‌య‌టికి రావ‌డం వివాదాస్ప‌దంగా మారింది. మ‌రోప‌క్క ద‌ర్శ‌న్ జైల్లో ఉన్న నేప‌థ్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న భ‌ర్త‌ను క‌లుస్తూ అత‌నికి ధైర్యం చెప్తోంది. మ‌రోప‌క్క ఆల‌యాల‌కు కూడా వెళ్తోంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ ద‌ర్శ‌న్ జైల్లో ఉంటే పార్టీ చేసుకోవ‌డం ఏంట‌ని ద‌ర్శ‌న్ అభిమానులు విజ‌య‌ల‌క్ష్మిని ట్రోల్ చేస్తున్నారు.