Balineni Srinivas Reddy: నేను వెళ్తున్నా.. బై బై
Balineni Srinivas Reddy: ఎట్టకేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తాను వెళ్లిపోతున్నట్లు కార్యకర్తలకు తెలియజేసారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. కొంతకాలంగా బాలినేని విషయంలో పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది. జగనన్నా.. శ్రీనన్నని ఒప్పించి తీసుకురండి అని స్థానిక కార్పొరేటర్లు, కార్యకర్తలు కోరగా.. ముందు తన నియోజకవర్గంలో ఉండి పని చేస్తే అప్పుడు ఆలోచిస్తా అని ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుంటే ఎలాగని జగన్ మాటిచ్చారు. ఇంతలో తాను ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని కార్యకర్తలతో చెప్పేసారు. ఈరోజు సాయంత్రానికి కానీ రేపు కానీ బాలినేని నుంచి అధికారిక ప్రకటన కూడా రాబోతోంది.