Vinesh Phogat: భార‌త ప్ర‌భుత్వం సాయం చేయ‌లేదు.. రాజ‌కీయాల వ‌ల్లే ఓడిపోయా

Vinesh Phogat says indian government did not help her during olympics

Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాములు అధిక బ‌రువు ఉంద‌ని డిస్‌క్వాలిఫై అయిన రెజ్ల‌ర్ వినేష్ ఫోగాట్ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. ఇండియ‌న్ ఒలింపిక్స్ అధ్య‌క్షురాలు పిటి ఉష త‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన మాట నిజ‌మే కానీ.. అక్క‌డే మీడియా ఉంద‌ని తెలిసి త‌న‌పై చెయ్యి వేసి త‌న‌కు తెలీకుండా ఫోటో తీసుకుని అక్క‌డి నుంచి వెళ్లిపోయిందని.. ఆ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన‌ట్లు క్యాప్ష‌న్‌లో పేర్కొంద‌ని వెల్ల‌డించింది.

క‌నీసం త‌న‌కు సెమీ ఫైన‌ల్స్ వ‌ర‌కు వ‌చ్చినందుకు వెండి ప‌త‌కం ఇవ్వాలి అని CASను విన్న‌వించుకునేందుకు కూడా భార‌త ప్ర‌భుత్వం సాయం చేయ‌లేద‌ని.. తానే సొంతంగా పిటిష‌న్ వేసుకున్నాన‌ని తెలిపింది. తాను పిటిష‌న్ వేసుకున్నాక మ‌రుస‌టి రోజు ప్ర‌ముఖ న్యాయ‌వాది హ‌రీష్ సాల్వే త‌న కేసును వాదించేందుకు వ‌చ్చార‌ని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త ప్రభుత్వం చేసిన రాజ‌కీయాల వ‌ల్లే తాను ఓడిపోయాన‌ని వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ ఫోగాట్‌కు హర్యాణా ఎన్నిక‌ల్లో జులానా జిల్లా నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చారు.