Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య
Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఇవాళ ఉదయం ఆయన ఉంటున్న అపార్ట్మెంట్లోని ఏడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ వెంటనే ఘటనా స్థలానికి పోలీసులతో సహా చేరుకున్నారు. అనిల్ అరోరా మృతదేహాన్ని పోస్ట్మార్టెంకు తరలించారు. విషయం తెలుసుకున్న మలైకా ఒక్కసారిగా హతాశులయ్యారు. తన తండ్రి మృతదేహాన్ని చూసే ధైర్యం కూడా లేదని మలైకా తన ఇంట్లోని ఓ గదిలో కూర్చుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు.
అనిల్ అరోరాకు మలయాళీ క్రిస్టియన్ అయిన జాయిస్ పాలీకార్ప్ అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఒకరు మలైకా, మరొకరు అమృత. అమృత పలు సినిమాల్లో నటించి వివాహం అయ్యాక నటన ఆపేసింది. మలైకా ఐటెం సాంగ్స్‌తో మంచి పేరు సంపాదించుకుంది. మలైకాకు 11 ఏళ్ల వయసులోనే అనిల్, జాయిస్ విడిపోయారు. ఆ తర్వాత మలైకా, అమృత తన తల్లి వద్దే పెరిగారు.