Kareena Kapoor: నా భర్తకు నేను సెక్సీగా కనిపిస్తా.. సర్జరీలు అక్కర్లేదు
Kareena Kapoor: హీరోయిన్లు వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపించేందుకు కాస్మెటిక్ సర్జరీలు, బొటాక్స్‌లు చేయించుకుంటూ ఉంటారు. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్‌లు ఇప్పటికీ బొటాక్స్ ఫిల్లర్లు వేయించుకుంటున్నారు. వీరికి పెళ్లి కూడా అయిపోయింది. ఐశ్వర్యకు ఓ పాప ఉంది. కత్రినా కైఫ్ తల్లి కాబోతోందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే విషయం పెళ్లై ఇద్దరు పిల్లలున్న కరీనా కపూర్‌ని అడిగితే.. నాకు సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? నా భర్తకు నేను సెక్సీగానే కనిపిస్తా అని ధీటుగా సమాధానం ఇచ్చారు.
“” వయసు మీద పడటం అనేది సహజంగా జరిగేదే. నాకు ఇప్పుడు 44 ఏళ్లు. కానీ ఇప్పటికీ అందంగా కనిపించేందుకు మేకప్ వేసుకుంటాను కానీ సర్జరీలు, బొటాక్స్‌లు వంటివి చేయించుకోను. ఆ అవసరం ఏముంది? నేను ఎలా ఉన్నా మా ఆయనకు సెక్సీగానే కనిపిస్తాను. నా ఫ్రెండ్స్‌కి ఇప్పటికీ నేను అందంగా కనిపిస్తా. ఇప్పటికీ నేను చేసే సినిమాలను ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు. అలాగని నేను వయసుకు తగ్గ రోల్స్ చేస్తుంటానే తప్ప ముసలిదానిలా కనిపించాలనో లేక 20 ఏళ్ల అమ్మాయిగా కనిపించాలనో చేయను. నేను వయసులో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఇప్పుడు అంతకంటే ఆనందంగా ఉన్నాను “” అని వెల్లడించారు.