Simbu: డ‌బ్బు వ‌ద్దు.. ప‌వ‌న్‌పై ఇష్టంతో పాడాను

i sang for og only because of my respect for pawan kalyan

Simbu: ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు సింబులో మంచి గాయ‌కుడు కూడా ఉన్నాడు. ఈయ‌న మ‌న తెలుగు సినిమాల‌కు కూడా ఎన్నో పాట‌లు పాడాడు. ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న ఓజీ సినిమాలో కూడా ఓ పాట‌ను సింబునే పాడారు. అయితే.. పాట పాడినందుకు గానూ నిర్మాత దాన‌య్య పారితోషికం ఎంత కావాల‌న్నా ఇస్తాను అని సింబుతో అన్నార‌ట‌. దీనికి సింబు స్పందిస్తూ.. త‌న‌కు డ‌బ్బు వ‌ద్ద‌ని.. ప‌వ‌న్‌పై అభిమానం, ఇష్టంతోనే పాట పాడానే తప్ప పారితోషికం కోసం కాద‌ని అన్నారు.

ఆ పారితోషికాన్ని విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల‌కు ఇస్తే తాను మ‌రింత సంతోషిస్తానని చెప్పిన‌ట్లు నిర్మాత దాన‌య్య వెల్ల‌డించారు. అంతేకాదు.. విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల‌కు, తెలంగాణ వర‌ద బాధితుల‌కు సహాయార్థం సింబు రూ.6 ల‌క్షల మేర సాయం చేసారు. తెలుగు రాష్ట్ర వ‌ర‌ద బాధితుల‌కు సాయం చేసిన ఏకైక త‌మిళ న‌టుడు సింబునే.