Congress: గ్యారంటీల అమలు కోసం గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్

congress green signal for ganja cultivation in himachal pradesh

Congress: ఇచ్చిన గ్యారెంటీల అమ‌లుకు డ‌బ్బులు లేక ఏకంగా గంజాయి పండించాల‌ని నిర్ణ‌యించింది హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం. గంజాయి సాగు ద్వారా ఏడాదికి రూ.2000 కోట్లు సమకూరుతాయని అంచనా. దాంతో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం గంజాయి సాగు చేయాలని నిర్ణయించింది. గంజాయి సాగుపై శాసనసభలో చర్చ జ‌ర‌ప‌గా.. సాగుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించడం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఆర్థిక‌ మంత్రి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యాన నిపుణులు, రాజకీయ వేత్తలతో కమిటీ ఏర్పాటుచేసారు. కమిటీ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం ల‌భించింది.