Tushar Deshpande: ధోనీ 100 మీటర్ల సిక్స్.. నాకు తిట్లు పడ్డాయ్
Tushar Deshpande: ఓసారి ట్రైనింగ్ సమయంలో తాను వేసిన బౌన్సర్ వల్ల ధోనీ చేత తిట్లు తిన్నానని అన్నాడు తుషార్ దేశ్‌పాండే. ఇటీవల జింబాబ్వే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు తుషార్. 2023లో ప్రిపరేటరీ క్యాంప్ సమయంలో ధోనీ తన వద్దకు వచ్చి సలహాలు ఇచ్చారని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు కావాల్సిన అన్ని క్వాలిటీలు తనలో ఉన్నాయని ధోనీ చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.
ఈ నేపథ్యంలో తుషార్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ధోనీతో ట్రైనింగ్ సెషన్ అవుతున్నప్పుడు తాను బౌన్సర్ వేసానని.. దానిని ధోనీ 100 మీటర్ల సిక్స్ బాదాడని అన్నారు. ఆ తర్వాత ధోనీ తన దగ్గరికి వచ్చి.. నిన్ను బౌన్సర్ ఎవడు వేయమన్నాడు? యోర్కర్ ఎందుకు వేయలేదు? నీ బౌలింగ్ స్కిల్స్ మీద నీకే నమ్మకం లేదా? నువ్వు యోర్కర్ మాత్రమే ట్రై చేయ్. ఎందుకంటే యోర్కర్ను ఎవ్వడూ 100 మీటర్ల మేర బాదలేడు అని తిడుతూనే మంచి సలహా ఇచ్చాడని ఆ సలహాను మాత్రం తాను జీవితంలో మర్చిపోలేనని తెలిపాడు తుషార్.