Pawan Kalyan: మీకు యాక్షన్ సినిమా కావాలా? మీడియా సమావేశంలో ఆసక్తికర సన్నివేశం
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చిన్న ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పిఠాపురానికి భారీ వర్షాలు, వరదల హెచ్చరిక రావడంతో ఆయన తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేసథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ వరదలకు ఎంత నష్టం వాటిల్లిందో ఇంకా కరెక్ట్ వివరాలు రాలేదని.. ఒక్కసారి వివరాలు వచ్చాక ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నామో క్లియర్గా చెప్తానని అన్నారు. బుడమేరు వద్ద అక్రమ నిర్మాణాలు జరగడం వల్లే వరద ఉధృతి పెరిగిందని.. మరి హైడ్రా తరహా నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటారా అని ఓ జర్నలిస్ట్ పవన్ను అడిగారు. దీనికి పవన్ స్పందిస్తూ.. “” మీకు యాక్షన్ సినిమా కావాలా? హైడ్రా తరహా అంటే ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు ఢీకొట్టడం అనే అంశంలో కుట్ర ఉందని అంటున్నారు. నాకు ఈ విషయంలో పూర్తి అవగాహన లేదు. ఏమో జరిగి ఉండచ్చేమో “” అని వెల్లడించారు.