Niharika: చైతన్య ఆ వీడియో డిలీట్ చేసారా?
Hyderabad: కొద్దిరోజులుగా మెగా డాటర్ నిహారిక(Niharika) విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా పెళ్లి పిక్స్ సోషల్ మీడియా ఖాతాలో నుంచి డిలీట్ చేసిన నిహారిక, త్వరలోనే జొన్నలగడ్డ చైతన్య(Chaithanya Jonnalagadda)కు అఫీషియల్ గా విడాకులు పంపించబోతుంది అంటూ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే తాజాగా చైతన్య పోస్ట్ చేసిన ఒక వీడియో ఈ వార్తలు రూమర్స్ అని అనుమానం కలగజేస్తోంది.
2020లో రాజస్థాన్ లోని ఉదయ్ ఘడ్ ప్యాలస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉందనిపించుకుంది. కానీ ఈ మధ్య ఈ జోడి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది. దీంతో నిహారిక కొణిదెల(Niharika Konidela), జొన్నలగడ్డ చైతన్య(Chaithanya Jonnalagadda) మధ్య విభేదాలు వచ్చాయని నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి. ముందుగా నిహారిక భర్త చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి తమ పెళ్లి ఫొటోలను డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. అయితే ఈ వార్తలపై నిహారికతో పాటు కుటుంబ సభ్యులు ఎవరు కూడా స్పందించలేదు.
కాగా, చాలాకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేని చైతన్య తాజాగా షూ పట్టుకుని వ్యాయామం చేస్తున్న వీడియో షేర్ చేశారు. దీంతో తన విడాకులపై ఊహాగానాలకు చెక్ పెట్టారంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది. గాలి మాటలు మాట్లాడేవారికి చెప్పుదెబ్బతో సమాధానం ఇచ్చారంటూ సంబరపడిపోతున్నారు మెగా అభిమానులు. అయితే, మరెందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు, విడాకుల వార్తలపై నేరుగా ఎందుకు స్పందించడం లేదు అంటూ కామెంట్ల వర్షం కురిపించారు నెటిజన్లు. దాంతో కాసేపటికే ఆ వీడియోను డిలీట్ చేశారు చైతన్య. మరి దీనిపై మెగా ప్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.