Donald Trump: ఎన్నికలకు ముందు ట్రంప్‌కు భారీ ఊరట
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట లభించింది. 2019ఎన్నికలకు ముందు ట్రంప్‌కు భారీ ఊరట కలిగింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు రహస్యంగా డబ్బులు చెల్లించి ఆ లావాదేవీలను అఫిడవిట్లో చూపించకుండా తారుమారు చేసారు అనే కేసు విషయమై న్యూయార్క్ కోర్టు శిక్షను ఎన్నికల తర్వాతకు వాయిదా వేసింది. ఆయనకు పడే శిక్ష అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించకూడదు అన్న ఉద్దేశంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్‌కు ప్రత్యర్ధిగా కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నారు. నవంబర్ 26న ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు శిక్ష విధించనుంది.
ఏం జరిగింది?
అమెరికా చరిత్రలోనే తొలిసారి ఆ దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఓ కేసులో నిందితుడిగా తేలాడు. అగ్ర రాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పోర్న్ స్టార్ స్టార్మీ డ్యానియల్స్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం జరిగిన విచారణలో నిందితుడిగా తేలాడు.
డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ పోర్న్ స్టార్ స్టార్మీ డ్యానియల్స్కు డబ్బు చెల్లించి ఆ విషయాన్ని 2019 ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదని కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యూయార్క్ కోర్టులో వ్యాఖ్యలు చేయడం షాకింగ్ అంశంగా మారింది. డ్యానియల్స్తో ట్రంప్ ఎఫైర్ పెట్టుకుని ఈ విషయం బయటకు పొక్కకుండా 130,000 డాలర్లు చెల్లించాడట.
2016 ఎన్నికలకు ముందు ఆమెకు డబ్బు చెల్లించిన అంశాన్ని దాచి పెట్టి ఎన్నికల నియమావళిని ఉల్లఘించారని న్యూయార్క్ కోర్టులో ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మరో వైపు డబ్బు చెల్లించిన మాట నిజమే కానీ ట్రంప్ పరువును కాపాడుకునేందుకే చెల్లించారని ట్రంప్ తరఫు న్యాయవాది తెలిపారు. వాదోపవాదాలు విన్న న్యూయార్క్ కోర్టు ట్రంప్‌ను దోషిగా ప్రకటించింది. మరి ఇప్పుడు ట్రంప్ రాజకీయ భవిష్యత్తు ఎంటా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.