Snake: పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి?

why snake sheds its skin

 

Snake: పాములు కుబుసం విడుస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అస‌లు పాములు ఎందుకు కుబుసం విడుస్తాయో? దాని వెనుకున్న కార‌ణ‌మేంటో తెలుసుకుందాం.

పాములు పెరిగే కొద్ది వాటి చ‌ర్మం పెర‌గ‌దు. అందుకే అవి కుబుసం విడుస్తాయి. ఈ కుబుసం విడిచే ప్ర‌క్రియ‌ను ఎక్డిసిస్ అంటారు.

పాము బ‌తికున్నంత కాలం ఇలా కుబుసం విడుస్తూనే ఉంటుంది.

పాము పెరుగుతున్న కొద్ది దాని చ‌ర్మం కింద మ‌రో కొత్త చ‌ర్మం ఏర్ప‌డుతూనే ఉంటుంది. పాత చ‌ర్మాన్ని తీసేయ‌డానికి అవి చెట్ల‌కు త‌మ శ‌రీరాన్ని రాసుకుంటూ ఉంటాయి. అలా కుబుసం విడుస్తాయి. ఈ కుబుసం విడ‌వ‌డానికి చిన్న సైజు పాముల‌కైతే కొన్ని క్ష‌ణాలు ప‌డుతుంది. అదే పెద్ద పాముల‌కైతే గంట‌లు ప‌డుతుంది.

చ‌ర్మం పాత‌దైపోయిన‌ప్పుడు పొడిబారిపోతుంది. కుబుసం విడిచే స‌మ‌యంలో పాముకు క‌ళ్లు స‌రిగ్గా క‌నిపించ‌వు. కుబుసం విడిచే స‌మ‌యంలో దాని క‌ళ్లు నీలంగా మారిపోతాయి.

కుబుసం విడిచే స‌మ‌యంలో శ‌రీరంపై గాయాలున్నా త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి. పురుగులు ప‌ట్టి ఉంటే పోతాయి. కుబుసం విడిచాక పాము మ‌రింత ఆరోగ్యవంతంగా మారుతుంది.

వ‌య‌సులో ఉన్న పాములు రెండు మూడు వారాల‌కోసారి కుబుసం విడిస్తే.. వ‌య‌సైపోయిన పాములు ఏడాదికోసారి కుబుసం విడుస్తాయి.