Sobhita Dhulipala: శోభిత లేటెస్ట్ ఫోటోపై నాగచైతన్య రియాక్షన్
Sobhita Dhulipala: నటి శోభిత ధూళిపాల తొలిసారి తన నిశ్చితార్థపు ఉంగరం కనిపించేలా ఫోటో షూట్లో పాల్గొన్నారు. చీర కట్టులో శోభిత చాలా అందంగా కనిపించారు. అన్నిటికంటే ఆమె నిశ్చితార్థపు ఉంగరం ఫోటో షూట్కే హైలైట్గా నిలిచింది. ఈ ఫోటోపై తనకు కాబోయే భర్త, నటుడు నాగచైతన్య లైక్ కొట్టారు. చాలా మంది బాలీవుడ్ నటీనటులు ఫోటో చాలా బాగుందంటూ కామెంట్స్ పెట్టారు. ఆగస్ట్ 8న నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జనవరిలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్లో వివాహం చేసుకోబోతున్నారని టాక్. త్వరలో వివాహ తేదీ, వివరాలు వెల్లిడిస్తానని నాగచైతన్య తెలిపారు.