Renuka Swamy Murder: చివరి క్షణాల్లో.. వదిలేయమని వేడుకుంటూ..
Renuka Swamy Murder: కన్నడ నటుడు దర్శన్ తూగుదీప చంపిన తన అభిమాని రేణుకా స్వామి చివరి క్షణాల్లోని ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలు నిందితుల్లో ఒకరైన పవన్ అనే వ్యక్తి ఫోన్ నుంచి లీక్ అయినట్లు తెలుస్తోంది. రేణుకా స్వామిని కొట్టి టార్చర్ చేస్తున్న సమయంలో వీడియో తీస్తుండగా.. తనను వదిలేయమని వేడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నొప్పి భరించలేక అతను స్పృహతప్పి పడిపోగా అతన్ని లేపేందుకు మర్మాంగానికి కరెంట్ షాక్ ఇచ్చారని చార్జ్షీట్లో పేర్కొన్నారు. రేణుకా స్వామి శరీరంపై 37 గాయాలు.. విరిగిన ఛాతీ ఎముకలు.. ఛిద్రమైన మర్మాంగం కనిపించాయని వెల్లడించారు. అయితే రేణుకా స్వామి చివరి క్షణాల్లోని ఫోటో వైరల్ అవడంపై పోలీసులు స్పందించాల్సి ఉంది.