Koneti Adimulam: సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న TDP ఎమ్మెల్యే
Koneti Adimulam: సత్యవేడుకి చెందిన తెలుగు దేశం పార్టీ ఎమ్మోల్యే కోనేటి ఆదిమూలంపై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని కోనేటి ఆదిమూలంపై సత్యవేడు నియోజకవర్గం TDP మహిళా అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. తనపై మూడు సార్లు అత్యాచారం చేసాడని.. ఆగస్ట్‌లోనే తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ యువతి వాపోయింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తనకు న్యాయం చేయాలంటూ మీడియా ద్వారా వేడుకుంది. దాంతో తెలుగు దేశం పార్టీ అధిష్ఠానం ఆదిమూలంపై వేటు వేసింది. ఆయన్ను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేసింది.