Raja Saab: టైటిల్ మారింది..!
Raja Saab: రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ టైటిల్లో స్వల్ప మార్పు జరిగింది. ఈ సినిమాను రాజా సాబ్‌గా కాకుండా ప్రభాస్ ది రాజా సాబ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టైటిల్ రిజిస్ట్రేషన్‌లో సమస్యలు ఉండటం వల్లే పేరు మారినట్లు తెలుస్తోంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ మొత్తం రూ.400 కోట్ల వరకు ఉందని.. మిస్టర్ బచ్చన్ వల్ల కలిగిన నష్టాలను రాజా సాబ్ సినిమా పూడ్చేస్తుందని విశ్వ ప్రసాద్ వెల్లడించారు.