Allu arjun: లారెన్స్ నిర్ణ‌యానికి బన్నీ ఫిదా!

Hyderabad: స్టార్ కొరియోగ్రాఫ‌ర్ రాఘ‌వ లారెన్స్(raghava lawrence) తీసుకున్న నిర్ణ‌యానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) రియాక్ట్ అవ‌కుండా ఉండ‌లేక‌పోయారు. రాఘ‌వ(raghava) ఎంతో మంది చిన్నారుల‌కు ఆప‌రేష‌న్లు చేయించ‌డం, చ‌దువు చెప్పించ‌డం వంటివి చేస్తుంటారు. ఇటీవ‌ల 150 మంది పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు లారెన్స్(raghava lawrence). ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డిస్తూ పిల్ల‌ల‌తో దిగిన ఫొటోను షేర్ చేసారు. ఆయ‌న న‌టించిన రుద్ర‌న్ సినిమా ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మంలో భాగంగా పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని వారికి చ‌దువు చెప్పించే బాధ్య‌త‌ను తీసుకున్న‌ట్లు తెలిపారు. సేవ దైవంతో స‌మానం అని తెలిపారు. ఈ ట్వీట్‌కు అల్లు అర్జున్(allu arjun) స్పందిస్తూ “రెస్పెక్ట్” అన్నారు. గ‌తంలోనూ రాఘ‌వ.. త‌న త‌ల్లి పేరుతో ఓపెన్ చేసిన ఫౌండేషన్ ద్వారా అనాథ పిల్ల‌ల‌కు అన్నీ తానై నిలిచారు. ఆప‌దో ఎవ‌రున్నా త‌న‌వంతు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుటారు.