త‌ల స్నానం ఏ రోజు చేస్తే మంచిది?

what precautions need to be taken during head baths

Spiritual: చాలా మంది ప్ర‌తి రోజూ త‌ల‌స్నానం చేస్తుంటారు. మ‌రికొంద‌రు మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో చేస్తుంటారు. ఇంకొంద‌రు వారానికి ఒక‌సారి మాత్ర‌మే చేస్తుంటారు. అస‌లు త‌ల స్నానం విష‌యంలో మ‌న శాస్త్రం ఏం చెప్తోంది? ఎప్పుడు త‌ల‌కు పోసుకోవాలి? మ‌న శాస్త్రం ప్ర‌కారం మ‌గ‌వారు రోజూ త‌ల‌కు పోసుకోవాలి. ఆడ‌వారు రోజూ పోసుకోకూడ‌దు. అయితే.. ఇక్క‌డ త‌ల స్నానం చేయ‌డం వేరు త‌లంటుకోవ‌డం వేరు. త‌ల‌స్నానం అంటే మామూలుగా త‌ల‌పై నీళ్లు పోసుకోవ‌డం.. లేదా న‌దుల్లో మునిగి స్నానం ఆచ‌రించ‌డం. కానీ త‌లంటుకోవ‌డం అంటే కుంకుడుకాయ ర‌సం లేదా షాంపూల‌తో స్నానం చేయడం.

ఆదివారం తలంటుకోవ‌డం చేయ‌కూడ‌దు. ఇలా చేస్తే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కావాలంటే ఆదివారం రోజు త‌ల‌పై నీళ్లు పోసుకోవ‌చ్చు.

సోమ‌వారం త‌లంటుకుంటే ఆరోగ్యం పెరుగుతుంది.

మంగ‌ళ‌వారం పొర‌పాటున కూడా త‌లంటుకోకూడ‌దు. ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ విఫ‌లం అవుతుంటుంది.

బుధ‌వారం త‌లంటుకుంటే కీర్తి ప్ర‌తిష్టలు పెరుగుతుంది.

గురువారం త‌లంటుకోకుండా త‌ల స్నానం చేస్తే మంచిది. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు పెరుగుతుంటాయి

శుక్ర‌వారం రోజున త‌లంటుకుంటే ధ‌న న‌ష్టం క‌లుగుతుంది. ఒక‌వేళ ప్ర‌త్యేక‌మైన పూజ‌లు చేయాల‌నుకుంటే అప్పుడు త‌లంటుకోవ‌చ్చు.

ఉద్యోగాలు రావ‌డం లేదు అని బాధ‌ప‌డేవారికి శ‌నివారం త‌లంటుకుంటే వారికి ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి.