ఈ రోజుల్లో తలకు నూనె రాస్తే దరిద్రమే
Spiritual: తలకు ఎప్పుడు పడితే అప్పుడు ఏ రోజు పడితే ఆ రోజు నూనె రాసేసుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. తలకు నూనె ఎప్పుడు రాసుకోవాలి ఎప్పుడు రాసుకోకూడదు అనే అంశాలను కూడా మన శాస్త్రంలో చెప్పారు. చాలా మంది ఆదివారం సెలవు రోజు కావడంతో చక్కగా నూనె రాసేసుకుని తలస్నానం చేసేస్తుంటారు. ఇది చాలా మంది చేసే అతిపెద్ద తప్పు. నిజానికి ఆదివారం రోజున అసలు తలకు నూనె రాసుకోకూడదు. ఆదివారం తలకు నూనె రాసుకునేవారికి జ్వరం, ఒంట్లో వేడి ఎక్కువ అవడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
మనిషి మంచి కాంతివంతంగా కనిపించాలంటే సోమవారం నూనె రాసుకుంటే మంచిది
మంగవారం తలకు నూనె రాసుకుంటే ఇంట్లో లేనిపోని గొడవలు వస్తాయి
బుధవారం రోజు రాసుకోవచ్చు. దీని వల్ల శరీరానికి పుష్ఠిని ఇస్తుంది.
గురువారం రోజున వద్దు. ఎందుకంటే కొన్ని అవ్వాల్సిన పనులు ఆటంకాలు కలుగుతుంటాయి. ఇది కేవలం తలకే కాదు ఒంటికి కూడా మంచిది కాదు
శుక్రవారం, శనివారాల్లో చక్కగా రాసుకోవచ్చు. శనివారం నాడు తలకు, శరీరానికి నూనె రాసుకుని స్నానం చేస్తే అర్థాష్టమ శని, ఏలినాటి శని పోతుంది. అదే రోజున నూనెను ఆలయాల్లో దానం చేస్తే మంచిది.
ఆది, మంగళ వారాల్లో నూనె రాసుకుంటే అర్థాష్టమ, ఏలినాటి శని ప్రభావం పెరుగుతుంది.