Chandrababu Naidu: మాన‌వ‌త్వం లేదా? రేపు మ‌నం చ‌నిపోతే ఎవ‌డు తీస్తాడు?

Chandrababu Naidu slams officers who are acting irresponsible during rescue

“” ప్ర‌భుత్వం నుంచి మేం చేయాల్సిన‌వ‌న్నీ చేస్తాం. స‌మాజం కూడా మాకు సాయం చేయాలి. మీకు కుదిరితే బాధితుల‌కు వండిపెట్టి క్యారేజ్ పంప‌డ‌మో.. వారికి ఆర్థిక సాయం చేయ‌డ‌మో ఇలా ఏది తోస్తే అది చేయండి. స‌మాజం బాగుంటేనే మ‌నం బాగుంటాం. అంతేకానీ.. ఎవ‌డో చ‌నిపోతే మ‌న‌కేంటి అనుకోకండి. రేపు మ‌నం చ‌నిపోతే మ‌న శ‌వాన్ని ఎవ‌రు మోసుకెళ్తాడు? ఇలాంటి ఆలోచ‌న త‌ప్పు. మ‌న ఇంట్లో మ‌నిషి చ‌నిపోతే ఎలా ఉంటుందో అలా బాధితుల‌కు అండ‌గా నిల‌వండి. మీడియా వ‌ర్గాలు కూడా త‌ప్పుడు వార్త‌లు రాయ‌కండి. ఇక జ‌గ‌న్ విష‌యానికొస్తే.. నిన్న ఐదు నిమిషాలు షో చేసాడు. క‌నీసం ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చిన పాపాన పోలేదు.

ప్ర‌కాశం బ్యారేజీ పిల్ల‌ర్‌ను బోట్లు ఢీకొన్నాయి అని తెలీగానే ముందు ఇది ప్ర‌మాదం అనుకున్నా. కానీ చాలా మంది అనుమానం ఉంది అంటున్నారు. దాంతో నాక్కూడా అనుమానం మొద‌లైంది. లేక‌పోతే వ‌రుస‌గా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆహారం క‌లుషితం కావ‌డం ఏంటి? హాస్ట‌ల్‌లో కెమెరాలేంటి? ప్ర‌కాశం బ్యారేజీని బోట్లు ఢీకొన‌డం ఏంటి? ఇవ‌న్నీ ఇప్పుడే జ‌రుగుతున్నాయి. నాకు అనుమానించ‌డం త‌ప్ప మ‌రో దారి కనిపించ‌డంలేదు. బాబాయిని హ‌త్య చేసి నారాసుర చ‌రిత్ర అని రాసిన‌వాడు ఎలాంటి కుట్ర‌లకైనా పాల్ప‌డ‌తాడు. కాబ‌ట్టి ఏ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మంత్రి, ఎమ్మెల్యే త‌మ ప్రాంతాల్లో విజిలెన్స్ పెంచుకోవాలి. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌నివ్వ‌కూడ‌దు. ఎప్పటిక‌ప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి “” అని తెలిపారు.