Rhea Chakraborty: 40 ఏళ్లకి పెళ్లి చేసుకుంటే బెస్ట్
Rhea Chakraborty: తూనీగ తూనీగ అనే సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింటి నటి రియా చక్రవర్తి. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన రియా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. కానీ ఒకే ఒక్క సంఘటన ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ప్రేమలో ఉన్న రియా.. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది అంటూ ఆమెను దాదాపు రెండు నెలల పాటు జైల్లో ఉంచారు. రియా సుశాంత్‌కి డ్రగ్స్ అలవాటు చేసిందని.. ఆ మైకంలోనే అతను డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రియా బెయిల్‌పై ఉంది. కానీ ఆమె ఎక్కడికైనా దేశం దాటి వెళ్లాంటే పోలీసుల వద్దకు వెళ్లి పాస్‌పోర్ట్ కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం రియాకు ఎవరూ అవకాశాలు కూడా ఇవ్వడం లేదు.
ఆమె కూడా నోరు తెరిచి అడగలేకపోతోంది. ఈ నేపథ్యంలో చాప్టర్ 2 అనే పాడ్‌కాస్ట్‌తో రియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా జెరోదా సహ వ్యవస్థాపకుడైన నిఖిల్ కామత్‌తో డేటింగ్ గురించి రియా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిఖిల్‌తో డేటింగ్ నిజమే కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పుడైతే లేదని అన్నారు. ఒకవేళ పెళ్లంటూ చేసుకుంటే 40 ఏళ్లు వచ్చాక చేసుకోవడమే మంచిదని.. అలా చేసుకుని ఎంతో సంతోషంగా జీవిస్తున్నవారు తన స్నేహితుల్లో చాలా మంది ఉన్నారని అన్నారు. ఏ రోజైతే తాను పెళ్లి చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన రోజు రాదో అదే రోజున తాను వివాహం గురించి ఆలోచిస్తానని తెలిపారు.