అమెజాన్‌కు NTR డిన్న‌ర్ పార్టీ..!

Hyderabad: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(ntr).. అమెజాన్ స్టూడియోస్‌(amazon studios)కు స్పెష‌ల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో అమెజాన్ స్టూడియెస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్‌తో పాటు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి(rajamouli) కూడా హాజ‌ర‌య్యారు. సినీ ప‌రిశ్ర‌మ నుంచి ప‌లువురు ప్ర‌ముఖుల‌ను కూడా తార‌క్ ఆహ్వానించారు. “ఫ్రెండ్స్, వెల్ విషెర్స్‌తో ఈవెనింగ్ పార్టీ చాలా బాగా జ‌రిగింది. జేమ్స్, ఎమిలీతో మంచి టైం స్పెండ్ చేసాం. నా ఆహ్వానాన్ని అంగీక‌రించి పార్టీకి వ‌చ్చి మాట నిల‌బెట్టుకున్నందుకు థ్యాంక్యూ అమెజాన్ స్టూడియోస్” అని తార‌క్ ట్వీట్ చేసారు. ఈ డిన్న‌ర్ పార్టీకి ద‌ర్శ‌కుడు సుకుమార్, నిర్మాత దిల్‌రాజుల‌ను కూడా తార‌క్ ఆహ్వానించారు. కానీ సుకుమార్ పుష్ప‌2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండ‌డంతో రాలేక‌పోయారు. దిల్‌రాజు కూడా పని మీద దిల్లీ వెళ్ల‌డంలో వెళ్ల‌లేక‌పోయార‌ట‌. అయితే ఉన్న‌ట్టుండి అమెజాన్ స్టూడియోస్‌కు తార‌క్ పార్టీ ఇవ్వడం వెనుక ఏదో పెద్ద ప్లానే ఉంద‌ని అంటున్నారు అభిమానులు. అమెజాన్‌తో క‌లిసి తార‌క్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి.