Gabbar Singh Rerelease: ఆరోజు పవన్ కళ్యాణ్ ప్రాణం పోయేదే
Gabbar Singh Rerelease: పవర్‌స్టార్ అభిమానుల కోసం సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన గబ్బర్ సింగ్‌ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ టీం ప్రెస్ మీట్ నిర్వహించారు. సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేష్ ఈ సందర్భంగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
“” నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చారు. ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఉండే నన్ను పిలిచి గబ్బర్ సింగ్‌కు నిర్మాతగా ఉంటావా అని పవన్ అడిగారు. నా మీద నాకు నమ్మకం లేదు. అలాంటిది పవన్ చెప్పారు కాబట్టి నేను నిర్మాతనయ్యాను. ఆ తర్వాత నా జీవితమే మారిపోయింది. గబ్బర్ సింగ్ షూటింగ్ మొత్తం హరీష్ శంకర్‌కే వదిలేద్దాం అని పవన్ అన్నారు. ఓసారి నేను పవన్ దగ్గరికి వెళ్లి చొక్కా బటన్లు తీయమంటే మీరు తీయడం ఏంటి సర్ అంటే.. నువ్వు పక్కకు పోరా అన్నారు. అది పవన్ కళ్యాణ్‌కు దర్శకుడిపై ఉన్న నమ్మకం. ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే పవన్ నెలలో పది రోజులు షూటింగ్ చేసుకుని మిగతా రోజుల్లో ఆయన హాయిగా విదేశాల్లో ఎంజాయ్ చేయచ్చు. కానీ తాను నమ్ముకున్న ప్రజల కోసం కుటుంబాన్ని వదిలేసి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. నేను అనుకున్న ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన లేరు. ఏదో ఒకరోజు సీఎం అవుతారు. ఆరోజున నేను మళ్లీ మాట్లాడతాను.
ఈరోజు ఉదయం నేను జాగింగ్‌కి వెళ్తుంటే ఓ వ్యక్తి వచ్చి ఏంటయ్యా గబ్బర్ సింగ్ రీ రిలీజ్‌కు ఇంత హడావిడి ఉంది అని అడిగాడు. వాడికి నేను ఒక్కటే చెప్పాను. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్త్రవులకు బైబిల్ ఎలాగో పవన్ అభిమానులకు గబ్బర్ సింగ్ అలా అని. ఇప్పుడు పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా ఆయన్ను సాయం అడుగుదాం అని నా మిత్రుడు నాతో చెప్తే.. ఆయన నేరుగా గు** మీద తంతాడు రా. ఆయన పిలిచినప్పుడు వెళ్లాలి తప్ప మన అవసరం కోసం కాదు అని చెప్పాను. ఈ సందర్భంగా మీకు గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. షూటింగ్ గుజరాత్‌లో జరుగుతోంది. ఆ సమయంలో పవన్ గుర్రంపైకి ఎక్కి వెళ్లాల్సిన సీను. ఆ సమయంలో పవన్ గుర్రంపై నుంచి పడబోయారు. ఆయన పడి ఉంటే గనక 100 శాతం ప్రాణం పోయేదే. అంత కష్టపడ్డారు పవన్ “” అని తెలిపారు బండ్ల గణేష్.
చిరంజీవి గారు ఒక్క అవకాశం ఇస్తే బ్లాక్‌బస్టర్ ఇస్తా
చిరంజీవి గారి పేరు చెప్పుకుని చాలా మంది బాగుపడ్డారు. నాకు పవన్ కళ్యాణ్ జీవితం ఇచ్చారు కాబట్టి ఆయన నాకు దేవుడితో సమానం. చిరంజీవి గారంటే నాకు ఎంతో గౌరవం. ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. కాకపోతే నేను స్వార్థపరుడిని. అందరికంటే నెంబర్ వన్‌లో ఉండాలని అనుకుంటాను. అందుకే ఇంద్ర రీ రిలీజ్ కంటే ఎక్కువ కలెక్షన్స్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్‌కి రావాలని కోరుకుంటున్నాను. మీ మీడియా ముఖంగా నా నుంచి ఒక రిక్వెస్ట్. చిరంజీవి గారు ఎందరికో ఎన్నో అవకాశాలు ఇచ్చారు. నాకు హరీష్ శంకర్‌కు ఒక్క అవకాశం ఇవ్వమనండి. ఒక్క 70 రోజులు మాకు ఇస్తే బ్రహ్మాండమైన బ్లాక్‌బస్టర్ ఇస్తాం.
నా రక్తంలోనే కాంగ్రెస్ ఉంది
నేను పవన్ కళ్యాణ్‌కు అభిమానినే. కానీ రాజకీయంగా మాత్రం నా రక్తంలో కాంగ్రెసే ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉంటాను. నాకు ఏ పదవీ వద్దు. కాంగ్రెస్ పార్టీ నన్ను వద్దు అనుకుంటే నేను కోళ్ల ఫారం బిజినెస్ చూసుకుంటూ నా సినిమాలు నేను చేసుకుంటా. అంతేకానీ జనసేనలో ఉంటానని మాత్రం కలలో కూడా ఊహించుకోకండి.