“నీకు జుట్టే లేదు.. నువ్వు క్యాప్ పెట్టుకో”

akhilesh yadav asks yogi adityanath to wear a cap

Akhilesh Yadav: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌.. స‌మాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంది. ఆ మాట‌ల చ‌ర్చ కాస్తా రాజ‌కీయాల నుంచి వ్య‌క్తిగ‌త అంశాల వైపు మ‌ళ్లింది. అఖిలేష్ యాద‌వ్ ఎర్ర టోపీ పెట్టుకుని పెద్ద పోజ్ కొడుతుంటారని.. టోపీ ఎరుపే కానీ చేసే ప‌నులే న‌లుపు అని యోగి సెటైర్ వేసారు. దాంతో అఖిలేష్‌కు ఒళ్లు మండింది. ఎరుపు రంగు భావోద్వేగాల‌కు చిహ్నం అని.. అమ్మ‌వారికి ప్ర‌తిరూపం అని అన్నారు. నిజానికి ఈ ఎర్ర టోపీ అనేది త‌న‌కంటే యోగికే ఎంతో అవ‌స‌రం అని.. ఎందుకంటే యోగికి జుట్టు లేదంటూ వెక్కిరించ‌డం వివాదాస్ప‌దంగా మారింది.