Zoya Akhtar: రేప్ సీన్లు చూస్తారు కానీ లిప్ కిస్ చూడరా?
Zoya Akhtar: సినిమాల్లో చూపించే రేప్ సీన్లు, సెక్స్ సీన్లు బాగా చూస్తారు కానీ లిప్ కిస్ సీన్లు ఎందుకు చూడరు అని ప్నశ్నించారు ప్రముఖ బాలీవుడ్ లిరిసిస్ట్ జోయా అక్తర్. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జోయా సినిమాల్లో చూపించే సెక్స్, రొమాంటిక్ సీన్లకు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేదానిపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. సినిమాల్లో తెరపై పరస్పర అంగీకారంతో చేసే శృంగారం, రొమాంటిక్ సన్నివేశాలను చూపించడం ఎంతో అవసరమని అన్నారు.
కానీ ఆడియన్స్ మాత్రం ఇలాంటివి చూపిస్తే సినిమా తీయకుండా పోర్న్ ఫిలిం తీసారు అన్నట్లు నిందలు వేస్తారని.. అదే ఆడియన్స్ సినిమాల్లో రేప్ సీన్లు పెడితే మాత్రం అరెరె అన్నట్లు చూస్తారని అన్నారు. తెరపై ఎప్పుడైతే ఒక లైంగిక చర్యను, ముద్దులను, కౌగిలింతలను ఇద్దరి ఇష్టంతోనే జరగాలి, జరుగుతాయి అని చూపిస్తామో అప్పుడే నో మీన్స్ నో అనే మాటకు అర్థం తెలుస్తుందని చెప్పారు. జోయా ఈ వ్యాఖ్యలు చేయగానే చాలా మంది లేచి మరీ చప్పట్లు కొడుతూ ఆమె ఆలోచనా విధానాన్ని మెచ్చుకున్నారు.