Zomato: ఫుడ్ డెలివ‌రీకి వ‌చ్చి.. మ‌ర్మాంగం చూపించి..

woman alleges zomato deliver boy has shown his genitals

Zomato: జొమాటో డెలివ‌రీ బాయ్ చేసిన షాకింగ్ ప‌ని వ‌ల్ల ఓ యువ‌తి షాక్‌లో ఉంది. ఫుడ్ డెలివ‌రీ చేయ‌డానికి వ‌చ్చిన ఆ వ్య‌క్తి తన మర్మాంగం చూపిస్తూ సాయం చేయండి అని అడిగాడ‌ట‌. ఈ ఘ‌ట‌న అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. భారీ వ‌ర్షం ప‌డుతోంద‌ని ఓ యువ‌తి కాఫీ తాగాల‌నుకుంది. ఇంట్లో క‌రెంట్ లేక‌పోవ‌డంతో జొమాటోలో కాఫీ ఆర్డ‌ర్ పెట్టుకుంది. అప్ప‌టికే రాత్రి 11 గంట‌లు అవుతోంది. ఈ నేప‌థ్యంలో డెలివ‌రీ బాయ్ వ‌చ్చి బెల్ కొట్టాడు. అయితే ఆర్డ‌ర్ కాస్త ఆల‌స్యం అవ‌డంతో అత‌ను వెకిలి న‌వ్వు న‌వ్వుతూ సారీ చెప్తున్నాడ‌ట‌.

ఇట్స్ ఓకే అని చెప్పి ఆ యువ‌తి లోప‌లికి వెళ్తుంటే.. త‌న కాలికి గాయ‌మైంద‌ని.. కాస్త సాయం చేయండి అని ఆ వ్య‌క్తి అన్నాడ‌ట‌. చీక‌టిలో ఏమీ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ యువతి ఫోన్ టార్చ్ వేసి చూసింది. తీరా చూస్తే డెలివ‌రీ బాయ్ కాలిని చూపించ‌కుండా త‌న మ‌ర్మాంగం చూపించి సాయం చేయండి అని వికృతంగా ప్ర‌వ‌ర్తించాడ‌ట‌. వెంట‌నే ఆ యువ‌తి లోప‌లికి వెళ్లి త‌లుపు వేసుకుంది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. జొమాటో సంస్థ‌కు కూడా కంప్లైంట్ చేసింది. ఈరోజుల్లో ఇంట్లో నుంచి ఆర్డ‌ర్ పెట్టుకుంటున్నా కూడా ఆడ‌పిల్ల‌ల‌కు వేధింపులు త‌ప్ప‌డం లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది.