Mopidevi Venkataramana: జగన్తో ఇబ్బంది.. అన్నీ చెప్పుకోలేను
Mopidevi Venkataramana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటంపై స్పందించారు మోపిదేవి వెంకటరమణ. తాను, బీద మస్తాన్ రావు రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నానని త్వరలో తెలుగు దేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వైసీపీకి రాజీనామా వెనుక బలమైన కారణాలున్నాయని.. జగన్ ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ తాను అన్నీ చెప్పుకోలేనని పేర్కొన్నారు. నిజానికి తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించినప్పుడే రాజీనామా చేయాలని అనుకున్నానని అన్నారు.