Hydraa: సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు
Hydraa: తెలంగాణలో హైడ్రా సంస్థ అక్రమ కట్టడాల భరతం పడుతోంది. బడా నేతలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా నోటీసులు పంపింది. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి నివాసం ఉండగా ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో వైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.