Vishwak Sen: బాలీవుడ్‌కి విశ్వ‌క్‌సేన్ “ధ‌మ్కీ”

Hyderabad: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన తాజా సినిమా ‘దాస్ కా ధమ్కీ’(Das Ka Dhamki). ఇటీవల రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విశ్వక్(Vishwak Sen) స్వయంగా డైరెక్ట్ చేయడంతో, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రాన్ని విశ్వక్(Vishwak Sen) తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కాగా, ఇప్పుడు బాలీవుడ్‌లో ధమ్కీ ఇచ్చేందుకు మాస్ కా దాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇప్పటికే హిందీ డబ్బింగ్ పనులు ముగించుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ సినిమాలో అందాల భామ నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించగా, ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. రోహిణి మొల్లేటి, అజయ్, రావు రమేష్, హైపర్ ఆది, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. బాలీవుడ్​(Bollywood)లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న విశ్వక్​ సేన్(Vishwak Sen) ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి​.