Vijay Verma: నా ప్రేమ‌ను దాచ‌లేను.. నా ఫోన్ నిండా త‌మ‌న్నా ఫోటోలే

Vijay Verma says he has 5000 photos with tamannah bhatia

Vijay Verma: మొత్తానికి మ‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త్వ‌ర‌లో ఓ ఇంటి వారు కాబోతున్నార‌ని తెలుస్తోంది. బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా దాదాపు ఏడాది నుంచి ప్రేమ‌లో ఉన్నారు. వీరిద్ద‌రూ ల‌స్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో కలిసి న‌టించారు. ఆ త‌ర్వాత వీరి ప‌రిచ‌యం కాస్తా స్నేహంగా మారి అది ప్రేమ‌కు దారి తీసింది. అయితే ఈ విష‌యాన్ని వారిద్ద‌రూ దాచాల‌ని అనుకోలేదు. తామిద్ద‌రం ప్రేమ‌లో ఉన్నామ‌ని నిర్మొహ‌మాటంగా బ‌య‌ట‌పెట్టారు.

ఎందుకు ప్రైవేట్‌గా ఉంచ‌లేదు అని విజ‌య్ వ‌ర్మ‌ను అడ‌గ్గా.. “” ఇందుకు దాచ‌డానికి ఏముంది? నేను త‌మ‌న్నా ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు దీనిని ప్రైవేట్‌గా ఉంచాలంటే మేం బ‌య‌టికి వెళ్ల‌లేం. మా ఫ్రెండ్స్ మా ఫోటోలు తీయ‌లేరు. ఎందుకు ఇంత బాధ‌. త‌న‌పై నాకున్న ప్రేమ‌ను దాచాల‌నుకోలేదు. అయితే ఎంత వ‌ర‌కు ప‌బ్లిక్‌కి తెలియాలో అంత వ‌ర‌కే తెలిసేలా చూసుకుంటున్నాం. ఉదాహ‌ర‌ణ‌కు నా ఫోటోలో త‌మ‌న్నాకు సంబంధించిన దాదాపు 5000 ఫోటోలు ఉన్నాయి. ఫోన్ నాదే అయిన‌ప్ప‌టికీ నా గ్యాల‌రీ మొత్తం త‌మ‌న్నా ఫోటోల‌తో నిండిపోయింది “” అని తెలిపారు విజయ్. ఇక పెళ్లి గురించి అడ‌గ్గా.. త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.