Y Chromosome: భూమిపై ఇక మగవారే ఉండరు..!
Y Chromosome: భూమిపై ఇక ఆడవాళ్లే ఉండబోతున్నారా? మగ జాతి అంతరించిపోనుందా? అవును. ఎందుకంటే మగ పుట్టుకకు కారణమయ్యే వై క్రోమోసోమ్ (Y Chromosome) అంతరించిపోనుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. మనిషి శరీరంలో రెండు క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్. ఎక్స్ క్రోమోజోమ్ ఆడ పుట్టుకను వై క్రోమోజోమ్ మగ పుట్టుకను నిర్ధారిస్తుంది. అయితే ఈ వై క్రోమోజోమ్ అంతరించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీని అర్థం ఇక మగపిల్లలు పుట్టరు. ఆడపిల్లలే పుడుతుంటారు.
జపాన్‌లో స్పైనీ అనే జాతికి చెందిన ఎలుకలు ఉంటాయి. ఈ ఎలుకల్లో ఆల్రెడీ వై క్రోమోజోమ్ అంతరించిపోయిందట. దాంతో కేవలం ఆడ ఎలుకలే పుడుతున్నాయి. అయితే.. వై క్రోమోజోమ్ పోయినప్పటికీ మరో క్రోమోజోమ్ తయారుకావడంతో… మగ ఎలుకలు కూడా పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎలుకల్లో జరిగిన మాదిరిగానే మనుషుల్లో కూడా ఈ వై క్రోమోజోమ్ అంతరించిపోనుందట. ఒకవేళ వై క్రోమోజోమ్ అంతరించిపోయినా.. మరో క్రోమోజోమ్ పుట్టుకొచ్చినా.. దాని వల్ల కొన్ని రిస్క్‌లు ఉంటాయని అంటున్నారు. గడిచిన లక్షల సంవత్సరాల్లో మనుషుల్లో ఈ వై క్రోమోజోమ్ చాలా జన్యువులను (Genes) కోల్పోయింది. ఇంకొన్నేళ్లు ఇలాగే వై క్రోమోజోమ్ నుంచి జన్యువులు మిస్సైతే మాత్రం మరో 11 మిలియన్ ఏళ్లలో అసలు మగజాతి అనేదే ఉండదు.